![]() |
![]() |

మహిళ దినోత్సవం సందర్భంగా ప్రతీ ఒక్కరు తమ సోషల్ మీడియాలో మహిళలని ఉద్దేశించి కొన్ని పవర్ ఫుల్ కోట్స్ తో పోస్ట్ లు చేస్తున్నారు. ఇక బుల్లితెర ధారావాహికల్లో గుప్పెడంత మనసు కి ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. అందులో రిషి, వసుధారల ఆన్ స్క్రీన్ ప్రేమకథకి ఫ్యాన్స్ ఎక్కువే. అయితే రిషి అలియాస్ ముఖేష్ గౌడ ఉమెన్స్ ఆర్ పవర్ ఫుల్ అంటూ ఓ వీడియోని పోస్ట్ చేశాడు. మొదట కార్ లో ఎక్కడికో వెళ్తున్నట్టుగా ఓ వీడియోని పోస్ట్ చేసాడు. ఆ తర్వాత తన ఫ్యాన్ గర్ల్ చేసిన ఓ వీడియోని అప్లోడ్ చేశాడు ముఖేష్ గౌడ.
ముఖేష్ గౌడ ఆరోగ్యం బాలేదని, ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాడని గుప్పెడంత మనసు డైరెక్టర్ కుమార్ పంతం ఓ పోస్ట్ లో తెలిపాడు. గుప్పెడంత మనసు సీరియల్ లో మొదట వసుధార, రిషిల లవ్ స్టోరీకి చాలా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఎంతలా అంటే ఆ సీరియల్ టైమ్ స్లాట్ కోసం ఎదురుచూసేంత.. అందరికి చేరువైన ఈ సీరియల్ లో ఎన్నో మార్పులు జరిగాయి. మొదట కాలేజీలో రిషి, ఫణింద్ర, జగతి, మహేంద్ర, వసుధార ఉండేవారు. ఆ తర్వాత కొన్ని ఎపిసోడ్ ల తర్వాత విలన్ శైలేంద్ర ఎంట్రీ ఇచ్చాడు. అలా అతడికి డీబీఎస్టీ కాలేజీ ఎండీ సీటు మీద ఉన్న మక్కువతో తనకి అడ్డుగా ఉన్న జగతిని చంపేశాడు శైలేంద్ర. ఆ తర్వాత రిషిని అడ్డుతొలగించాలనుకున్నాడు. కానీ అప్పుడే కథలోకి ఏంజిల్ వచ్చింది. కొన్ని రోజులు రిషి అజ్ఞాతంగా ఏంజిల్ దగ్గర ఉండగా వసుధార వెతుక్కుంటూ వెళ్ళి తీసుకొచ్చింది. ఇక రిషి వాళ్ళ నాన్న మహేంద్ర ఎమోషనల్ గా మారి మద్యానికి బానిసగా మారగా .. అతడిని మార్చడం కోసం రిషి, వసుధార కలిసి ఊటికి తీసుకెళ్ళారు. అక్కడ అనుపమ ఎంట్రీ ఇచ్చింది. అలా కథలోకి కొత్త పాత్రలు వస్తూనే ఉన్నాయి.
ఊటిలో వసుధార, రిషి, మహేంద్ర, ఉండగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చి శైలేంద్రే దోషి అని చెప్పాడు. ఇక అదే సమయంలో రిషి కన్పించకయండా పోయాడు. ఇక మళ్ళీ కొన్ని ఎపిసోడ్ ల తర్వాత అడవిలో ఇద్దరు ముసలివాళ్ళకి రిషి దొరికినట్టు చూపించారు. ఇక అంతా ఓకే అనుకున్న సమయంలో కాలేజీ యూత్ ఫెస్టివల్ కోసం రిషిని వసుధార వాళ్ళ నాన్న చక్రపాణి తోసుకొస్తుండగా కొందరు దుండగులు చక్రపాణి తలపై కొట్టి రిషిని తీసుకెళ్ళినట్టు చూపించారు. ఇక అక్కడి నుండి రిషి చనిపోయాడంటూ కొన్ని ఆధారలని చూపించారు. కానీ వసుధార నమ్మలేదు. అదే సమయంలో మను ఎంట్రీ ఇచ్చాడు. ఇక తాజా ఎపిసోడ్ లో రిషిని తీసుకొస్తానంటూ తనకి మూడు నెలల గడువు కావాలంటు వసుధార చెప్పింది. అంటే మరికొన్ని ఎపిసోడ్ ల తర్వాత గుప్పెడంత మనసులోకి మళ్ళీ రిషి వస్తున్నాడు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అతను మహిళల కోసం ఓ స్పెషల్ వీడియో అప్లోడ్ చేసాడు.
![]() |
![]() |